Pulwama: 350 కిలోల బాంబు తయారీ వెనుక నాటి అఫ్గన్ వార్ కమాండర్!

  • డిసెంబర్ లో ఇండియాకు వచ్చిన అబ్దుల్ రషీద్ ఘాజీ
  • ఆపై పుల్వామాకు చేరుకున్న ఉగ్రవాది
  • నిత్యమూ జేఈఎం చీఫ్ తో టచ్ లో ఘాజీ

జైషే మహమ్మద్ కమాండర్, ఆఫ్గన్ యుద్ధంలో పనిచేసిన ఐఈడీ స్పెషలిస్ట్ అబ్దుల్ రషీద్ ఘాజీ నేతృత్వంలోనే భారత సైన్యంపై దాడికి పథకం రూపొందిందని ఇంటెలిజెన్స్ ఏజన్సీలు అనుమానిస్తున్నాయి. స్కార్పియో వాహనంలో 350 కిలోల ఐఈడీ పేలుడు పదార్థాలను ఆయనే అమర్చారని కూడా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

కశ్మీర్ లోయలోకి గత సంవత్సరం డిసెంబర్ 9నే ఘాజీ ప్రవేశించినట్టు సైన్యానికి ఆధారాలు చిక్కాయి. ఆపై డిసెంబర్ నెలాఖరుకు పుల్వామా చేరుకున్న ఘాజీ, అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడని తెలుస్తోంది. కాలినడకనే ఎక్కువగా ప్రయాణిస్తుండే ఘాజీ, అప్పుడప్పుడూ ప్రజా రవాణా వాహనాల్లోనూ ప్రయాణిస్తుంటాడని సమాచారం.

ఎప్పటికప్పుడు జేఈఎం చీఫ్ మౌలానా మసూద్ అజర్ తో టచ్ లో ఉండే ఘాజీ, డిసెంబర్ నుంచే ఈ ఎటాక్ కోసం ప్లాన్ చేశాడని, పేలుడు పదార్థాలను పాక్ ఐఎస్ఐ సహకారంతో సరిహద్దులు దాటించారని సైనిక వర్గాలు వెల్లడించాయి. ఘాజీ ఇండియాలో తిరుగుతున్నాడన్న వార్తలు జనవరి తొలివారంలోనే మీడియాలో ప్రచురితం అయ్యాయి. ఇదే విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ఖరారు చేస్తూ, హెచ్చరికలు పంపాయి. అప్పుడే జాగ్రత్తలు తీసుకుని ఉంటే, ఇప్పుడీ ఘాతుకం జరిగుండేది కాదేమో!

  • Loading...

More Telugu News