Pakistan: ఉగ్రదాడులతో పాకిస్థాన్‌పై చర్యలు: ప్రాధాన్యత దేశాల జాబితా నుంచి ఉపసంహరణ

  • అరుణ్‌ జైట్లీ ప్రకటన
  • సీసీఎస్‌ సమావేశంలో దాడిపై సమీక్ష
  • అనంతరం నిర్ణయం వెల్లడించిన భారత్‌

జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు దాడులు చేసిన ఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌పై చర్యకు భారత్‌ సిద్ధమైంది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన క్యాబినెట్‌ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ (సీసీఎస్‌) సమావేశంలో దాడి, అనంతర పరిస్థితులపై కూలంకుషంగా సమీక్షించారు.

అనంతరం హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వాణిజ్య పెంపుతో సహా పలు వెసులుబాటులకు ఉద్దేశించిన ఎంఎఫ్‌ఎన్ (అత్యంత ప్రాధాన్యత దేశాలు) హోదాను పాకిస్థాన్‌కు ఉపసంహరించినట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు. అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్‌ను పూర్తిగా ఏకాకిని చేసేందుకు చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. దాడికి పాల్పడిన వారిని, దాడి వెనుక ఉన్న శక్తులను వదిలిపెట్టే  ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. అయితే సీసీఎస్‌ సమావేశంలో చర్చకొచ్చిన అంశాలను మాత్రం రాజ్‌నాథ్‌ మీడియాకు వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News