vandebharat express: ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ
- న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో కార్యక్రమం
- రైలులో ప్రయాణించిన రైల్వే మంత్రి తదితరులు
- ఢిల్లీ-వారణాసి మధ్య పరుగులు పెట్టనున్న సెమీ హైస్పీడ్ రైలు
ఢిల్లీ-వారణాసి మధ్య పరుగులు పెట్టనున్న ఇంజన్ రహిత సెమీ హైస్పీడ్ రైలు ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ను శుక్రవారం భారత్ ప్రధాని నరేంద్రమోదీ న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. భారత్‌లోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ఇది. ఈ సందర్భంగా రైలు ప్రయాణించే మార్గాల్లోని కాన్పూర్, అలహాబాద్ రైల్వేస్టేషన్లలో ప్రత్యేక కార్యకలాపాలను నిర్వహించారు.
ఢిల్లీ-వారణాసి మధ్య మొత్తం 750 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు 9 గంటల 40 నిమిషాల్లో పూర్తిచేయనుంది. మధ్యలో కాన్పూర్, అలహాబాద్‌లో 40 నిమిషాలపాటు ఆగనుంది. ప్రారంభోత్సవం సందర్భంగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తోపాటు మరికొందరు మంత్రులు రైలులో కొద్దిదూరం ప్రయాణించారు.