Andhra Pradesh: ఏపీ డీఎస్సీ మెరిట్ జాబితాను విడుదల చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు!

  • రాజమహేంద్రవరంలో మీడియా సమావేశం
  • మొత్తం 7,092 పోస్టుల భర్తీకి పరీక్ష
  • మే 15న నియామక పత్రాల జారీ

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్ష మెరిట్ జాబితాను ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. రాజమహేంద్రవరంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి గంటా ఈ ఫలితాలను రిలీజ్ చేశారు. ఏపీలో మొత్తం 7,902 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ పరీక్షను నిర్వహించామని మంత్రి తెలిపారు. ఈ పరీక్ష కోసం 6,08,155 మంది దరఖాస్తు చేయగా.. 5,05,547 మంది రాత పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు.

జిల్లాలు, సబ్జెక్టుల వారీగా మెరిట్‌ జాబితాను రూపొందించామని మంత్రి పేర్కొన్నారు. తొలిసారిగా మ్యూజిక్, క్రాఫ్ట్ టీచర్ల పోస్టులను భర్తీ చేశామన్నారు. ఈ పరీక్షకు సంబంధించి మొత్తం 136 అభ్యంతరాలను స్వీకరించామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు  మే నెల 15వ తేదీన నియామక పత్రాలు అందజేస్తామనీ, వారికి 10 రోజుల పాటు శిక్షణ అందజేస్తామని మంత్రి గంటా అన్నారు.  అభ్యర్థులు తమ ఫలితాలను http://apdsc.cgg.gov.in వెబ్ సైట్ లో చూసుకోవచ్చు.

  • Loading...

More Telugu News