Chigurupati Jayaram: ఎన్నారై జయరాం హత్యకేసులో మరో పోలీసు అధికారిపై వేటు

  • రాకేశ్‌తో సంబంధాలున్న పలువురు పోలీసులపై వేటు
  • జయరాం హత్య తర్వాత రాయదుర్గం సీఐకు రాకేశ్ ఫోన్
  • సీఐపై అధికారుల వేటు.. హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్

ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్య కేసు అటూఇటు తిరిగి చివరికి పోలీసుల మెడకే చుట్టుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాకేశ్ రెడ్డికి సాయం అందించిన పలువురు పోలీసులపై ఉన్నతాధికారులు ఇప్పటికే వేటు వేశారు. తాజాగా, మరో పోలీసు అధికారిపైనా వేటు పడింది.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన జయరాం హత్యకేసు ఇప్పటికే పలు మలుపులు తిరిగింది. దర్యాప్తులో రోజుకో విస్తుబోయే నిజం వెల్లడవుతూ వస్తోంది. తాజాగా, ఈ కేసులో రాయదుర్గం సీఐ రాంబాబు పాత్ర కూడా ఉన్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. జయరాం హత్య తర్వాత రాంబాబుతో రాకేశ్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిపై వేటేసిన అధికారులు హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News