Vizag: విశాఖలో టీఎస్సార్ జాతీయ అవార్డుల ప్రదానం.. ఉత్తమ నటులుగా బాలకృష్ణ, నాగార్జున
- చిరంజీవి, మోహన్ బాబుతదితరుల హాజరు
- 2017 ఉత్తమ నటుడిగా బాలకృష్ణ
- చిరంజీవి చిన్నల్లుడికి బెస్ట్ డెబ్యూ అవార్డు
కళాపోషకుడు టి. సుబ్బరామిరెడ్డి మరోసారి సినీ ప్రముఖులందరినీ ఒక్క వేదికపైకి చేర్చారు. ప్రతి ఏడాది ఇచ్చే టీఎస్సార్ జాతీయ అవార్డుల కార్యక్రమాన్ని ఆయన ఈసారి కూడా ఘనంగా నిర్వహించారు. విశాఖపట్నం పోర్ట్ గ్రౌండ్ వేదికగా ఈ అవార్డుల ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈ జాతీయ అవార్డుల ప్రదానోత్సవానికి ప్రఖ్యాత యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ కార్యక్రమానికి టి. సుబ్బరామిరెడ్డితో పాటు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్ వంటి హేమాహేమీలు హాజరయ్యారు. మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా విచ్చేశారు.
2018 అవార్డు గ్రహీతల జాబితా
- ఉత్తమ నటుడు- అక్కినేని నాగార్జున (దేవదాస్)
- ఉత్తమ కథానాయకుడు- రామ్ చరణ్
- ఉత్తమ హీరో (డెబ్యూ)- కల్యాణ్ దేవ్ (విజేత)
- ఉత్తమ హీరోయిన్- పూజా హెగ్డే
- ఉత్తమ చిత్రం- మహానటి
- ఉత్తమ నటి- కీర్తి సురేశ్
- మోస్ట్ పాప్యులర్ మూవీ- రంగస్థలం
- మోస్ట్ పాప్యులర్ డైరక్టర్- సుకుమార్
- ఉత్తమ దర్శకుడు- నాగ్ అశ్విన్ (మహానటి)
- ఉత్తమ సంగీత దర్శకుడు- తమన్ (అరవింద సమేత)
- ఉత్తమ హాస్యనటుడు- అలీ
- ఉత్తమ నటుడు- నందమూరి బాలకృష్ణ (గౌతమీపుత్ర శాతకర్ణి)
- ఉత్తమ నటి- రకుల్ ప్రీత్ సింగ్ (రారండోయ్ వేడుక చూద్దాం)
- ఉత్తమ హీరోయిన్- రాశీ ఖన్నా
- ఉత్తమ హీరోయిన్ (డెబ్యూ)- షాలినీ పాండే (అర్జున్ రెడ్డి)
- ఉత్తమ చిత్రం (గౌతమీపుత్ర శాతకర్ణి)
- మోస్ట్ పాప్యులర్ మూవీ-ఖైదీ నెం.150
- ఉత్తమ దర్శకుడు- క్రిష్ (గౌతమీపుత్ర శాతకర్ణి)
- ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గాయకుడు- దేవిశ్రీప్రసాద్