purandeswari: ఏం.. మా అబ్బాయి వైసీపీలో ఉండకూడదా?: పురందేశ్వరి
- నెల్లూరులో పర్యటించిన పురందేశ్వరి
- హితేశ్ వైసీపీలో ఉంటే తప్పేంటని ప్రశ్న
- ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న బీజేపీ నేత
ఒకే కుటుంబానికి చెందిన వారు పలువురు వివిధ పార్టీల్లో ఉంటే తప్పులేనప్పుడు తమ కుమారుడు హితేశ్ వైసీపీలో ఉంటే తప్పేంటని బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నించారు. ఆదివారం నెల్లూరు జిల్లాలో పురందేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా ‘‘మీ కుటుంబం మొత్తం వైసీపీలో చేరిందిగా.. మీరెప్పుడు చేరుతున్నారు?’’ అన్న విలేకరుల ప్రశ్నకు ఆమె ఇలా సమాధానమిచ్చారు.
ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న పురందేశ్వరి కేంద్ర పథకాలను టీడీపీ ప్రభుత్వం తమవిగా ప్రచారం చేసుకుంటోందని దుయ్యబట్టారు. మోదీని ఎదుర్కొనేందుకు అవినీతి పార్టీలన్నీ ఒక్కటి అవుతున్నాయని ఆమె విమర్శించారు. మార్చి 1న ప్రధాని మోదీ విశాఖపట్టణంలో పర్యటించనున్నట్టు పురందేశ్వరి తెలిపారు.