sensex: అమ్మకాల ఒత్తిడితో కుప్పకూలిన మార్కెట్లు
- ఉదయం నుంచి ఒడిదుడుకులకు గురైన మార్కెట్లు
- కుదేలైన ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ షేర్లు
- 310 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. నేటి మార్కెట్ ఉదయం నుంచి తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేక పోయాయి. ముఖ్యంగా ఆటోమొబైల్, ఐటీ, ఫార్మా షేర్లు కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 310 పాయింట్లు నష్టపోయి 35,498కి పడిపోయింది. నిఫ్టీ 83 పాయింట్లు కోల్పోయి 10,641 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ లో టాటా మోటార్స్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, వేదాంత లిమిటెడ్ తదితర కంపెనీలు లాభపడ్డాయి. యస్ బ్యాంక్, టీసీఎస్, ఐటీసీ, ఐసీఐసీఐ, హిందుస్థాన్ యూనీలీవర్ తదితర కంపెనీలు నష్టపోయాయి.