Tamilnadu: అన్నాడీఎంకే-పీఎంకే మధ్య కుదిరిన పొత్తు.. 7 లోక్ సభ సీట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పిన అన్నాడీఎంకే!

  • ఉపఎన్నికల్లో మద్దతు ఇవ్వనున్న పీఎంకే
  • నిర్ణయాన్ని ప్రకటించిన ఇరు పార్టీలు
  • నేడు తమిళనాడులో పర్యటించనున్న మోదీ

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడులో కీలక పొత్తు కుదిరింది. అధికార అన్నాడీఎంకే, పట్టాలి మక్కల్ కట్చి(పీఎంకే) లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఒప్పందం ప్రకారం మొత్తం 39 లోక్ సభ స్థానాలకు గానూ పీఎంకే 7 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది. అలాగే ఓ రాజ్యసభ సీటును సైతం పీఎంకేకు అన్నాడీఎంకే కేటాయించింది.

ఇందుకు ప్రతిఫలంగా త్వరలో లోక్ సభ ఎన్నికలతో పాటు 21 అసెంబ్లీ సీట్లకు జరగనున్న ఉప ఎన్నికల్లో పీఎంకే అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వనుంది.  ఈ నిర్ణయాన్ని సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, పీఎంకే నేతలు అన్బుమణి రామ్ దాస్, ఎంకే మణి తదితరులు ప్రకటించారు. కాగా, నేడు ప్రధాని మోదీ తిరుపూర్, కన్యాకుమారిలో పర్యటించనున్న సందర్భంగా అన్నాడీఎంకే-బీజేపీ పొత్తుపై కూడా క్లారిటీ వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News