sensex: వరుసగా తొమ్మిదోరోజు పతనమైన సెన్సెక్స్
- చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి
- నష్టపోయిన ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్
- 145 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
దేశీయ మార్కెట్లలో నష్టాల పర్వం కొనసాగుతోంది. సెన్సెక్స్ వరుసగా తొమ్మిదో రోజు పతనమైంది. టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్ లు చివరి గంటలో అమ్మకాల ఒత్తిడికి గురికావడం మార్కెట్లపై ప్రభావం చూపింది. దీంతో ఉదయం నుంచి లాభాల్లో ఉన్న మార్కెట్లు చివర్లో నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 145 పాయింట్లు పతనమై 35,352కు దిగజారింది. నిఫ్టీ 36 పాయింట్లు కోల్పోయి 10,604 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ లో టీసీఎస్, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హీరో మోటో కార్ప్ లు టాప్ లూజర్లుగా నిలిచాయి. వేదాంత లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్జీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ అండ్ టీలు టాప్ గెయినర్లుగా ఉన్నాయి.