Xiaomi Mi 9: భారీ ర్యామ్ తో షియోమీ ఎంఐ 9 స్మార్ట్ఫోన్ విడుదల
- చైనాలో విడుదలైన షియోమీ ఎంఐ 9 స్మార్ట్ఫోన్
- మూడు వేరియంట్ లలో లభ్యం
- వెనుకభాగంలో 3కెమెరాలు
చైనా మొబైల్ దిగ్గజ సంస్థ షియోమీ తాజాగా తన నూతన స్మార్ట్ ఫోన్ 'ఎంఐ 9' ను బీజింగ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేసింది. 6 జీబీ/8 జీబీ ర్యామ్ తో పాటు 12 జీబీ లాంటి భారీ ర్యామ్ తో కూడా ఈ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేశారు. డీప్ స్పేస్ గ్రే, గ్రేడియంట్ బ్లూ, గ్రేడియంట్ పర్పుల్ వంటి మూడు రంగులలో లభించే ఈ ఫోన్లో అధునాతనమైన స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ ని అమర్చారు. 6.39 ఇంచుల భారీ డిస్ప్లే ఉన్న ఈ ఫోన్ వెనక భాగంలో 48/12/16 మెగాపిక్సల్ మూడు కెమెరాలు ఉన్నాయి. అలాగే 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
ఫోన్ ధరలు:
- 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్: రూ.31,725
- 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్: రూ.34,900
- 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్: రూ.42,300