bellamkonda: బెల్లంకొండ శ్రీనివాస్ జోడీగా అనుపమా పరమేశ్వరన్
- తమిళంలో 'రాచ్చసన్'
- తెలుగు రీమేక్ కి రంగం సిద్ధం
- సక్సెస్ కోసం అనుపమ వెయిటింగ్
తమిళంలో క్రితం ఏడాది భారీ విజయాలను అందుకున్న చిత్రాల జాబితాలో 'రాచ్చసన్' ఒకటిగా కనిపిస్తుంది. విష్ణు విశాల్ .. అమలా పాల్ జంటగా నటించిన ఈ సినిమా, వైవిధ్యభరితమైన చిత్రంగా మంచి మార్కులు కొట్టేసింది. అలాంటి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా .. రమేశ్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రీసెంట్ గా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కథానాయికగా ఎవరికి ఛాన్స్ దొరుకుతుందా అనే ఆసక్తి మొదలైంది. ఆ ఛాన్స్ అనుపమా పరమేశ్వరన్ కి దొరికినట్టు తాజా సమాచారం. ఈ సినిమాకి ముందు తెలుగులో ఆమె చేసిన 'తేజ్ ఐ లవ్ యు'.. 'హలో గురు ప్రేమకోసమే' చిత్రాలు పెద్దగా ఆడలేదు. దాంతో ఆమెకి ఇక్కడ అవకాశాలు తగ్గాయి. ఈ నేపథ్యంలోనే మళ్లీ 'రాచ్చసన్' రీమేక్ రూపంలో అవకాశం ఆమెను వెతుక్కుంటూ వెళ్లింది. ఈ సినిమా అయినా ఆమెకి సక్సెస్ ను ఇస్తుందేమో చూడాలి.