Mayavathi: గంగలో స్నానమాచరిస్తే పాపాలు పోతాయా? మీ నియంతృత్వ పాలనను ప్రజలు మరచిపోరు: మోదీపై మాయావతి విమర్శలు
- బీజేపీ తీసుకొచ్చిన నోట్ల రద్దు
- జీఎస్టీ సహా ప్రతీకార దాడులు
- కుల, మతతత్వంతో కూడిన పాలన
ప్రయాగరాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ పవిత్ర స్నానం ఆచరించారు. దీనిపై స్పందించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి.. గంగానదిలో పవిత్ర స్నానమాచరిస్తే మోదీ చేసిన పాపాలన్నీ తొలగిపోతాయా? అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
‘‘పవిత్ర సంగమంలో స్నానం చేయగానే ప్రధాని మోదీ ఎన్నికల్లో ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలు, ద్రోహాలు, ఇతర తప్పులకు సంబంధించిన పాపాలన్నీ తొలగిపోతాయా? కేంద్రంలో భారతీయ జనతా పార్టీ చేసిన నియంతృత్వ పాలనను ప్రజలు అంత సులభంగా మరచిపోలేరు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగేలా బీజేపీ తీసుకొచ్చిన నోట్ల రద్దు, జీఎస్టీ సహా ప్రతీకార దాడులు, కుల, మతతత్వంతో కూడిన పాలన ఇంకా ప్రజలకు గుర్తుంది’’ అని మాయావతి ట్వీట్లో పేర్కొన్నారు.