sekhar master: నేను అంతటి దుర్మార్గపు పనులేం చేయలేదు: శేఖర్ మాస్టర్

  • గురువుగారి కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్లాను
  • కనిపిస్తే చాలు బూతులు తిట్టేవాడు
  •  ఇకపై కలవనని చెప్పేసి వచ్చేశాను

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ .. తన మనసుకు బాధ కలిగించిన ఒక సంఘటనను గురించి ప్రస్తావించారు. "ఒక డాన్స్ మాస్టర్ ని నేను నా గురువుగా భావించేవాడిని. ఆయన దగ్గర నేను చాలా కాలం పాటు పనిచేశాను. మా గురువు గారిని ఒక వ్యక్తి కామెంట్ చేసినందుకు .. ఆ వ్యక్తిపై చేయి చేసుకుని పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్లాను. అలాంటి గురువుగారు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు అనే బాధ వుంది.

తరచూ ఆయన ఫోన్ చేసి బూతులు తిట్టేవారు .. తాగేసి అలా అన్నాను మనసులో పెట్టుకోవద్దు అనేవారు. సర్లే .. అని నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. ఇంటికి వెళ్లి కలిస్తే కూడా బూతులు తిట్టడం మొదలుపెట్టాడు .. దాంతో ఇకపై మిమ్మల్ని కలవనని చెప్పేసి వచ్చాను. ఆయన అది మనసులో పెట్టుకుని, 'నేను చనిపోయిన తరువాత నా శవాన్ని చూడటానికి కూడా రావొద్దు' అని అన్నారు. నిజం చెప్పాలంటే, నేను అంత దుర్మార్గపు పనులేం చేయలేదు" అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News