Pakistan: లాహోర్, ఇస్లామాబాద్ సహా అన్ని విమానాశ్రయాల మూసివేత... సైన్యం అధీనంలోకి ఎయిర్ పోర్టులు!
- గాల్లో ఉన్న విమానాలు వెంటనే ల్యాండ్ కావాలి
- సైన్యం అధీనంలోకి అన్ని ఎయిర్ పోర్టులూ
- వేలాది మంది ప్రయాణికులకు ఇబ్బందులు
తమ దేశంలోని అన్ని విమానాశ్రయాలనూ తక్షణం మూసివేస్తున్నట్టు పాకిస్థాన్ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. దేశవాళీ, అంతర్జాతీయ విమానాలన్నింటినీ రద్దు చేశామని వెల్లడించింది. లాహోర్, ముల్తాన్, ఇస్లామాబాద్, ఫైసలాబాద్, సియాల్ కోట్ తదితర ఎయిర్ పోర్టులను తిరిగి చెప్పేంతవరకూ తెరవరాదని, ఇప్పటికే గాల్లో ఉన్న విమానాలన్నీ, తక్షణం సమీపంలోని ఎయిర్ పోర్టుల్లో ల్యాండ్ కావాలని ఆదేశించింది. విమానాశ్రయాలన్నీ సైన్యం అధీనంలోకి వెళ్లిపోయాయని, ప్రస్తుతానికి వారి విమానాల సేవలకే పరిమితమని వెల్లడించింది. పాక్ ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Pakistan immediately stops its domestic and international flight operations from Lahore, Multan, Faisalabad, Sialkot and Islamabad airports. pic.twitter.com/nP3rHJr0Ky
— ANI (@ANI) February 27, 2019