Pakistan: పాకిస్థాన్ లో టెన్షన్ టెన్షన్.. ఎయిర్ పోర్టులన్నీ మూసివేత, విమాన సర్వీసులు రద్దు!
- పాక్ ఎఫ్-16ను కూల్చివేసిన భారత్
- లాహోర్, ఇస్లామాబాద్ లో సర్వీసుల నిలిపివేత
- గగనతలాన్ని మూసేస్తున్నట్లు ప్రకటన
పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని భారత్ ఈరోజు కూల్చివేసిన సంగతి తెలిసిందే. భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించడంతోనే ఈ చర్య తీసుకున్నట్లు భారత వర్గాలు తెలిపాయి. దీంతో పాకిస్థాన్ లో టెన్షన్ టెన్షన్ నెలకొంది.
ఈ నేపథ్యంలో అన్ని దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దుచేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. లాహోర్, ఇస్లామాబాద్, ఫైసలాబాద్, ముల్తాన్, సియాల్ కోట్ ఎయిర్ పోర్టుల నుంచి రాకపోకలను పూర్తిగా ఆపేస్తున్నట్లు వెల్లడించింది.
అంతేకాకుండా గగనతలాన్ని మూసివేస్తున్నామని చెప్పింది. ఇక భారత్, పాకిస్థాన్ ల మధ్య రాకపోకలు సాగిస్తున్న విమాన సర్వీసులపై కూడా ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఇరుదేశాల మధ్య తిరుగుతున్న విమానాలు తమ సొంత దేశాలకు చేరుకున్నాయి.