India: భారత్-పాక్ మధ్య ఇదే అంతిమ యుద్ధం కావచ్చు: పాకిస్థాన్ మంత్రి షేక్ రషీద్
- రాగల 72 గంటలు అత్యంత కీలకం
- యుద్ధమా? శాంతా? అనేది తేలిపోతుంది
- యుద్ధమొస్తే అది రెండో ప్రపంచ యుద్ధం కన్నా పెద్దదిగా ఉంటుంది
భారత్-పాక్ మధ్య ఇదే అంతిమ యుద్ధం కావచ్చని పాకిస్థాన్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ అన్నారు. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రషీద్ అహ్మద్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాగల 72 గంటలు అత్యంత కీలకమని, యుద్ధమా? శాంతా? అనేది తేలిపోతుందని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధం కనుక వస్తే, అది రెండో ప్రపంచయుద్ధం కన్నా పెద్దదిగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.