cwc: ఉద్రిక్తతల నేపథ్యంలో సీడబ్ల్యూసీ మీటింగ్ ను రద్దు చేసుకున్న కాంగ్రెస్
- ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు వద్దన్న కాంగ్రెస్
- దేశం మొత్తం ఐక్యం కావాల్సిన సమయం ఇది
- ప్రభుత్వం స్థిరమైన నిర్ణయానికి వచ్చేంత వరకు మౌనంగా ఉంటాం
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో సీడబ్ల్యూసీ మీటింగ్ ను, సంకల్ప్ ర్యాలీను కాంగ్రెస్ పార్టీ రద్దు చేసుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జీవాలా మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో దేశం మొత్తం ఐక్యం కావాల్సిన అవసరం ఉందని... అందుకే సీడబ్ల్యూసీ మీటింగ్ ను తాము రద్దు చేసుకున్నామని చెప్పారు. మన యుద్ధ విమానాన్ని పాకిస్థాన్ కూల్చివేసిందంటే... ఉద్రిక్తత మరింత పెరుగుతోందని అర్థమని అన్నారు. ప్రస్తుత పరిస్థితిపై ప్రభుత్వం స్థిరమైన నిర్ణయానికి వచ్చేంత వరకు తాము మౌనంగా ఉంటామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయం చేయడం సరికాదని అన్నారు.