Andhra Pradesh: టీడీపీ బీసీల పార్టీ అని మరోసారి రుజువైంది: కళా వెంకట్రావు
- ఒకేసారి 4 ఎమ్మెల్సీ స్థానాలను బీసీలకు ఇచ్చాం
- రజకులకు అవకాశం కల్పించడం ఇదే ప్రథమం
- అందరినీ సమానంగా పైకి తీసుకొస్తున్న సీఎం బాబు
ఏపీ చరిత్రలో ఏ పార్టీ ఒకేసారి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను బీసీలకు ఇవ్వలేదని టీడీపీ నేత కళా వెంకట్రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ చర్య ద్వారా టీడీపీ బీసీల పార్టీని అని మరోసారి రుజువైందని అన్నారు. స్వాత్రంత్యం వచ్చాక ఏపీ చట్టసభల్లో రజకులకు అవకాశం కల్పించడం ఇదే ప్రథమం అని అన్నారు. అందరినీ సమానంగా పైకి తీసుకొస్తున్న ఏకైక సీఎం చంద్రబాబు అని కొనియాడారు.