India: పైలట్ అప్పగింతపై ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోం: భారత ప్రభుత్వ వర్గాలు
- పాక్ బేషరతుగా అభినందన్ ని విడుదల చేయాలి
- అతన్ని కలిసేందుకు దౌత్యపరమైన అవకాశం కోరలేదు
- పాక్ ముందుగా ఉగ్రవాదులపై సత్వర చర్యలు చేపట్టాలి
భారత పైలట్ అభినందన్ అప్పగింతపై పాకిస్థాన్ తో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. పాక్ బేషరతుగా తక్షణమే అభినందన్ ని విడుదల చేయాలని కోరాయి. భారత పైలట్ ను కలుసుకునేందుకు దౌత్యపరమైన అవకాశం కోరలేదని, రెండు భారత విమానాలను కూల్చినట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తప్పుడు ప్రకటన చేశారని అన్నారు. కాగా, ఇమ్రాన్ ఖాన్ చర్చల ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. పాక్ ముందుగా ఉగ్రవాదులపై సత్వర చర్యలు తీసుకోవాలని, జై షే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలనే భారత్ లక్ష్యంగా చేసుకుందని, పాక్ మాత్రం భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు.