sensex: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- మార్కెట్లపై యుద్ధ భయాలు
- 37 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 14 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
యుద్ధ భయాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 37 పాయింట్లు నష్టపోయి 35,867కు పడిపోయింది. నిఫ్టీ 14 పాయింట్లు కోల్పోయి 10,729 వద్ద స్థిరపడింది. మరోవైపు అమెరికా-ఉత్తరకొరియా దేశాల మధ్య సమావేశం నేపథ్యంలో ఆసియా మార్కెట్లు కూడా నష్టాలను నమోదు చేశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ లో టీసీఎస్, మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటో కార్ప్, యాక్సిస్ బ్యాంక్ తదితర కంపెనీలు నష్టపోయాయి. కోల్ ఇండియా, ఓఎన్జీసీ, వేదాంత లిమిటెడ్, యస్ బ్యాంక్, ఎన్టీపీసీ తదితర కంపెనీలు లాభాల్లో ముగిశాయి.