Abhinandan: నేడు భారత్‌కు రానున్న అభినందన్.. కలుసుకునేందుకు ఢిల్లీ బయలుదేరిన తల్లిదండ్రులు
- భారత్ ఒత్తిడికి తలొగ్గిన పాక్
- నేడు పాక్ చెర నుంచి విడుదల కానున్న అభినందన్
- చెన్నై నుంచి ఢిల్లీకి అభినందన్ కుటుంబ సభ్యులు
భారత భూభాగంలోకి వచ్చిన పాక్ విమానాలను తరుముతూ ప్రమాదశాత్తు పాక్ సైన్యానికి బందీగా చిక్కిన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పాక్ ప్రభుత్వం నేడు విడుదల చేయబోతోంది. దౌత్యమార్గాల ద్వారా భారత్ తెచ్చిన ఒత్తిడికి తలొగ్గిన పాక్.. అభినందన్‌ను నేడు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ చేసిన ఈ ప్రకటనతో దేశం మొత్తం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది.
కాగా, ప్రస్తుతం చెన్నైలో ఉన్న అభినందన్ తల్లిదండ్రులు తమ కుమారుడిని చూసేందుకు ఢిల్లీ బయలుదేరారు. గురువారం రాత్రే వారు ఢిల్లీ పయనమయ్యారు. మరోవైపు, పాక్ చెర నుంచి విడుదల కాబోతున్న అభినందన్‌కు స్వాగతం పలికేందుకు అనుమతి ఇవ్వాలంటూ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రధాని నరేంద్రమోదీని కోరారు.