Andhra Pradesh: ఎన్నికల బరిలోకి మంత్రి లోకేశ్.. భీమిలి నుంచి పోటీ?

  • కుప్పం నుంచి లోకేశ్‌ను బరిలోకి దించాలని చంద్రబాబు యోచన
  • భీమిలివైపు మొగ్గు చూపిన లోకేశ్
  • విశాఖ ఉత్తరం నుంచి గంటా శ్రీనివాసరావు

రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ విశాఖపట్టణంలోని భీమిలి నుంచి శాసనసభకు పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. లోకేశ్‌ను కుప్పం నుంచి బరిలోకి దింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నప్పటికీ లోకేశ్ మాత్రం భీమిలివైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.

ఉత్తరాంధ్రపై పార్టీకి తొలి నుంచి గట్టి పట్టు ఉండడంతో లోకేశ్ కోస్తా నుంచే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. భీమిలి నుంచి లోకేశ్ పోటీకి దిగడం వల్ల అక్కడి మూడు జిల్లాలపైనా ఆ ప్రభావం పడుతుందని టీడీపీ అధిష్ఠానం కూడా భావిస్తోంది. లోకేశ్ భీమిలి నుంచి బరిలోకి దిగడం పక్కా అయితే, ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్టణం ఉత్తరం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.  

  • Loading...

More Telugu News