airports: విమానాశ్రయాల్లోకి విజిటర్స్‌కు నో ఎంట్రీ.. భద్రత కట్టుదిట్టం

  • తాజాగా మళ్లీ ఆదేశాలు జారీ చేసిన కేంద్రం
  • సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో జాగ్రత్తలు
  • ఉగ్రదాడులపై ఇంకా అనుమానాలు

దేశంలోని విమానాశ్రయాల్లోకి విజిటర్స్‌ను అనుమతించరు. నిన్నటి నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. ఉగ్ర శిబిరాలపై భారత్‌ బలగాల దాడి అనంతరం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం తాజాగా మళ్లీ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. దీంతో హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలు, దేశంలోని అన్ని విమానాశ్రయాల్లోకి విజిటర్స్‌ను అనుమతించరు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత పరిస్థితులన్నీ తనకు వ్యతిరేకంగా ఉండడంతో రగిలిపోతున్న పాకిస్థాన్‌ ఉగ్రవాదుల్ని ఎగదోయకుండా ఉండదన్న అనుమానంతో భారత ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు కొనసాగిస్తోంది.

ముఖ్యంగా పరోక్ష యుద్ధానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే పాకిస్థాన్‌ విమానాశ్రయాల్లో అలజడి సృష్టించే అవకాశం ఉందన్న అనుమానంతో మార్చి ఒకటి నుంచి ఈ చర్యలు తీసుకుంది. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు అందే వరకు ఈ నిబంధన కొనసాగుతుందని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు అధికారులు తెలియజేశారు.

  • Loading...

More Telugu News