abhinandan: అభినందన్ ను విచారించనున్న ఇంటెలిజెన్స్.. ఆయన ఎదుర్కోబోయే ప్రశ్నలు ఇవే!
- అభినందన్ ను విచారించనున్న ఐబీ, రా
- శారీరక, మానసిక అంశాల్లో తేడా ఉంటే... పైలట్ బాధ్యతలను వదులుకోవాల్సి ఉంటుంది
- లోతైన గాయాలు ఉంటే... కోలుకున్న తర్వాతే విధుల్లో చేరాల్సి ఉంటుంది
పాకిస్థాన్ కు చెందిన అత్యాధునిక ఎఫ్-16 యుద్ధ విమానాన్ని మన కాలం చెల్లిన మిగ్ విమానంతో కుప్పకూల్చిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. పాక్ ఆర్మీ చెర నుంచి ఆయన సురక్షితంగా నిన్న రాత్రి భారత గడ్డపై అడుగుపెట్టడంతో యావత్ భారతావని పులకించిపోయింది. ప్రస్తుతం ఆయన పలు విచారణలను ఎదుర్కోబోతున్నారు. డిపార్ట్ మెంటల్ ఎంక్వైరీతో పాటు ఐబీ, ఎన్ఐఏ అధికారులు కూడా ఆయనను విచారించనున్నారు. ఈ విచారణల్లో అసలు ఏం జరిగిందో పూస గుచ్చినట్టు అభినందన్ వివరించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో విచారణలో ఆయనకు ఈ ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అవేంటో చూద్దాం.
- శత్రువులకు దొరికిన తర్వాత స్వదేశానికి చేరేంత వరకు ఏమేం జరిగింది?
- శారీరక సామర్థ్యంపై పూర్తి వైద్య పరీక్షలు. దేశ రహస్యాలను తెలుసుకునే క్రమంలో ఏమైనా హింసకు గురి చేశారా? అనేది ఈ వైద్య పరీక్షల్లో తేలిపోతుంది.
- శరీరంలో ఏమైనా చిప్స్ ను చొప్పించారా? అనే కోణంలో పూర్తి స్థాయిలో స్కానింగ్.
- శరీరంలోకి ఏవైనా ఔషధాలు ప్రయోగించి, జాతీయ భద్రతాంశాలు తెలుసుకున్నారా?
- దేశ రహస్యాలను పాకిస్థాన్ కు అభినందన్ వెల్లడించారా?