abhinandan: పాక్ సైనికుల చెరలో తీవ్ర మానసిక వేధింపులకు గురైన అభినందన్
- అభినందన్ ను భౌతికంగా హింసించని పాక్ సైన్యం
- మానసికంగా వేధించిన వైనం
- 59 గంటల కస్టడీ తర్వాత భారత్ కు అప్పగింత
పాకిస్థాన్ సైనికుల అధీనంలో ఉన్న సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ తీవ్ర మానసిక వేధింపులకు గురయ్యారు. విశ్వసనీయ వర్గాల నుంచి ఈ సమాచారం అందిందని ఏఎన్ఐ తెలిపింది. పాక్ సైనికులు తనను భౌతికంగా హింసించనప్పటికీ... మానసికంగా వేధించారని ఆయన తెలిపినట్టు సమాచారం. 59 గంటల కస్టడీ తర్వాత అభినందన్ ను భారత్ కు పాక్ ఆర్మీ అప్పగించిన సంగతి తెలిసిందే.
ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ ఆసుపత్రిలో ఉన్న అభినందన్ ను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి పరామర్శించారు. విమానం నుంచి ల్యాండ్ అయిన పరిస్థితులు, పాక్ సైన్యం అదుపులోకి తీసుకున్న తర్వాత జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు.