modi: 2014 తర్వాత తొలిసారి అమేథీలో అడుగుపెట్టనున్న మోదీ
- ఆయుధ కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్న మోదీ
- సభకు లక్షా 25 వేల మంది హాజరవుతారని అంచనా
- భారీ భద్రతను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీలో రేపు ప్రధాని మోదీ పర్యటించనున్నారు. 2014 ఎన్నికల తర్వాత అమేథీకి ఆయన వెళ్తుండటం ఇదే ప్రథమం. పర్యటన సందర్భంగా బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. అక్కడ నెలకొల్పే ఆయుధ కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నారు.
మోదీ పర్యటన సందర్భంగా గాంధీల కంచుకోట అమేథీ కాషాయమయం అయింది. యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీలో గత డిసెంబరులో మోదీ పర్యటించారు. మరోవైపు, మోదీ సభకు లక్షా 25 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.