Jammu And Kashmir: కశ్మీర్లో 56 గంటలపాటు కొనసాగిన ఎన్ కౌంటర్.. ఐదుగురు భద్రతాసిబ్బంది, ఒక వ్యక్తి మృతి
- కుప్వారా జిల్లా హంద్వారాలో ఎదురుకాల్పులు
- శుక్రవారం నుంచి కొనసాగుతున్న ఎన్ కౌంటర్
- ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టిన భద్రతాదళాలు
జమ్మూకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో టెర్రరిస్టులు, భద్రతాదళాల మధ్య కొనసాగిన కాల్పులు 56 గంటల తర్వాత ముగిశాయి. కుప్వారా జిల్లాలోని హంద్వారాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు టెర్రరిస్టులను మన భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఇదే సమయంలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు, ఇద్దరు జమ్మూకశ్మీర్ పోలీసులతో పాటు ఒక సాధారణ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం నుంచి ఈ ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.
భద్రతాదళాల కాల్పుల్లో చనిపోయినట్టు నటించిన ఓ ఉగ్రవాది... భద్రతాదళాలు దగ్గరకు వచ్చేసరికి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ నేపథ్యంలో ఐదుగురు భద్రతాదళ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. టెర్రరిస్టులు దాక్కున్న రెండు ఇళ్లను, రెండు పశువుల కొట్టాలను సెక్యూరిటీ ఫోర్సెస్ పేల్చి వేశాయి.