Guntur District: కోటప్పకొండ తిరునాళ్లలో అపశ్రుతి.. కూలిన భారీ ప్రభ
- నేడు ప్రారంభం కానున్న తిరునాళ్లు
- ప్రభను కొండపైకి తీసుకొస్తుండగా ఘటన
- పలువురికి గాయాలు
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లలో చిన్నపాటి అపశ్రుతి చోటుచేసుకుంది. తిరునాళ్ల కోసం సిద్ధం చేసిన భారీ ప్రభను కొండపైకి తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు కూలింది. ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.
మహా శివరాత్రిని పురస్కరించుకుని నేడు కోటప్పకొండ తిరునాళ్లు వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. కొండపైకి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ తిరునాళ్లకు ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదా కల్పించింది. స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.