CISF: అతిపెద్ద సైకిల్ పరేడ్‌తో గిన్నిస్ రికార్డు సాధించిన సీఐఎస్ఎఫ్

  • ఒకే వరుసలో సైకిల్ తొక్కిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది
  • 1327 మంది.. 3.2 కిలోమీటర్ల దూరం
  • గత రికార్డు బద్దలు
కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) గిన్నిస్ రికార్డు సాధించింది. ఆదివారం నోయిడాలో అత్యంత పొడవైన సింగిల్ లేన్ సైకిల్ పరేడ్ నిర్వహించి రికార్డు సృష్టించింది. మొత్తం 1,327 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆగకుండా సైకిల్ తొక్కుతూ అందరినీ ఆకర్షించారు. ఒకే వరుసలో సమాన దూరం పాటిస్తూ 3.2 కిలోమీటర్లు ఎక్కడా ఆగకుండా సైకిల్ తొక్కారు. గతంలో 1,235 సైకిళ్లతో భారత్‌లోని హుబ్బాలి బైస్కిల్ క్లబ్ నెలకొల్పిన రికార్డును సీఐఎస్ఎఫ్ బద్దలు గొట్టింది. ఈ కార్యక్రమానికి ఈజిప్ట్‌కు చెందిన అహ్మద్ గమాలెల్దిన్ అహ్మద్ గబర్ గిన్నిస్ ప్రతినిధిగా హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం సీఐఎస్‌ఎఫ్‌కు గిన్సిస్ రికార్డు ధ్రువపత్రాన్ని అందజేశారు.
CISF
Guinness World Record
longest single line bicycle parade
Noida

More Telugu News