it grid: ‘ఐటీ గ్రిడ్’ వ్యవహారం.. నలుగురు ఉద్యోగులను హైకోర్టు జడ్జి ముందు హాజరుపరిచిన తెలంగాణ పోలీసులు!
- నలుగురు సహోద్యోగులు కనిపించడం లేదన్న అశోక్
- పిటిషన్ ను విచారణకు స్వీకరించిన జడ్జి జస్టిస్ చౌహాన్
- టీడీపీకి సేవలు అందిస్తున్న ఐటీ గ్రిడ్
తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్న ఐటీ గ్రిడ్ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులను తెలంగాణ పోలీసులు ఈరోజు హైకోర్టు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. తమ సహోద్యోగులు నలుగురు కనిపించడం లేదని ఐటీ గ్రిడ్ లో పనిచేస్తున్న అశోక్ అనే ఉద్యోగి నిన్న హైకోర్టును ఆశ్రయించారు. వరుసగా రెండు రోజులు సెలవులు కావడంతో పిటిషన్ ను అత్యవసరంగా ఇంటివద్దే విచారించాలని కోరారు.
ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్ చౌహాన్ నలుగురు ఉద్యోగులు ఫణి, భాస్కర్, చంద్రశేఖర్, విక్రమ్ గౌడ్ లను తమముందు ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించారు. అందుకు అనుగుణంగానే అధికారులు నలుగురు ఐటీ గ్రిడ్ ఉద్యోగులను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.