cyberabad: సీపీ సజ్జనార్ వ్యాఖ్యలు అహంకారపూరితం, హద్దు దాటారు: ఏపీ మంత్రి కాలవ

  • పరిధికి మించి ప్రవర్తిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు
  • ఏ రూపంలో ఈ వ్యవహారం ఎండగట్టాలో మాకు తెలుసు
  • చట్టప్రకారం మా హక్కులు ఉపయోగించుకుంటాం

హైదరాబాద్ లో టీడీపీ డేటా వివాదంపై ఏపీ మంత్రి మండలిలో చర్చ జరిగింది. ఏపీ సర్కార్ పై కేసులు పెడతాం, పోలీసులను అరెస్టు చేస్తామనడంపై చర్చించారు. టీడీపీ డేటా దొంగిలించి ప్రత్యర్థులకు అప్పగించారని, దాన్ని కప్పి పుచ్చుకునేందుకే దుష్ప్రచారం చేస్తున్నారని నేతలు మందలించారు.

అనంతరం అమరావతిలో ఏపీ మంత్రి కాలవ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ, సైబరాబాద్ సీపీ సజ్జనార్ వ్యవహార శైలిని తప్పుబట్టారు. సజ్జనార్ వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయని, ఆయన హద్దు దాటారని విమర్శించారు. పరిధికి మించి ప్రవర్తిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని, ఏ రూపంలో ఈ వ్యవహారం ఎండగట్టాలో తమకు తెలుసని, చట్టప్రకారం తమకు ఉన్న హక్కులు ఉపయోగించుకుంటామని అన్నారు. సీపీ సజ్జనార్ వ్యాఖ్యలపై ఏం చేయాలో ఆలోచిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంతో మాత్రమే ఏపీకి గొడవలు వస్తున్నాయని, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు చంద్రబాబు భయపడరని అన్నారు.

  • Loading...

More Telugu News