Andhra Pradesh: ఏపీ ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఫిర్యాదు చేసిన మంత్రులు

  • ఫారం-7 దరఖాస్తుల అంశంలో చర్యలు కోరుతూ వినతి
  • ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోంది
  • ఓట్లను అక్రమంగా తొలగించేందుకు ప్రతిపక్షం యత్నం

ఏపీ ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేదిని ఆ రాష్ట్ర మంత్రులు అమర్ నాథ్ రెడ్డి, సుజయకృష్ణ, ఫరూక్ ఈరోజు కలిశారు. ఫారం-7 దరఖాస్తుల అంశంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు.

అనంతరం, మీడియాతో అమర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ, ఒక పార్టీకి చెందిన సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని, ఓట్లను అక్రమంగా తొలగించేందుకు ఫారం-7ను వినియోగిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీ ఈ పనులకు పాల్పడుతోందని, టీఆర్ఎస్ తో కుమ్మక్కై ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలోనూ ఇలాంటి పనులే చేశారని, ఏపీలోనూ అదే తరహా అక్రమ విధానాలు అమలు చేస్తున్నారని, ఒక్కో నియోజకవర్గంలో వేల ఓట్లు తొలగించేందుకు యత్నిస్తున్నారని, ఈ స్కెచ్ లో మోదీ కూడా భాగస్వామేనని ఆరోపించారు. తప్పు చేసిన వారిని ఆయా జిల్లాల నుంచి బహిష్కరించాలని కోరారు.

  • Loading...

More Telugu News