India: పాత వీడియోను చూపించిన పాక్... ఫేక్ అని పట్టేసిన నెటిజన్లు!

  • జలాంతర్గాములు తమ నీళ్లలోకి వచ్చాయని ఆరోపణ
  • 2016 నాటి వీడియోను చూపిందంటున్న నెటిజన్లు
  • తొలుతగా కనిపెట్టిన ఇండియా టుడే యాంటి ఫేక్‌ న్యూస్‌ వార్‌ రూమ్‌

నెటిజన్ల సాక్షిగా పాకిస్థాన్ వక్రబుద్ధి మరోసారి బయటపడింది. ఇండియా అనునిత్యమూ బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకునే పాక్, భారత్‌ కు చెందిన ఓ సబ్‌ మెరైన్‌ తమ అధీనంలోని జలాల్లోకి చొరబడాలని చూసిందని, దాన్ని తిప్పికొట్టామని చెబుతూ, 50 సెకన్ల నిడివిగల ఫుటేజ్ ని నిన్న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే పాక్ నౌకాదళానికి వంతపాడుతూ, మీడియా ఈ విషయాన్ని చిలువలు, పలవలుగా చూపింది. అయితే, ఈ వీడియో, మూడు సంవత్సరాల క్రితం నాటిదని, 2016లో తీసిన వీడియో అని నెటిజన్లు కనిపెట్టేశారు.

ఈ విషయాన్ని తొలుత ఇండియా టుడే యాంటి ఫేక్‌ న్యూస్‌ వార్‌ రూమ్‌ కనిపెట్టింది. పాకిస్థాన్ అసత్య ప్రచారం చేస్తోందని ఇప్పటికే భారత్ మండిపడగా, పాక్ చూపిస్తున్న పాత వీడియోను వైరల్ చేస్తూ, నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఎప్పటిదో వీడియోను తెచ్చి, కొత్త తేదీని యాడ్ చేసి పాక్ గగ్గోలు పెడుతోందని, గతంలోనూ ఇటువంటి నిందలే మోపిందని ఆరోపిస్తున్నారు. ఇటువంటివి తాము వేలల్లో తయారు చేసి పాక్ పై ఆరోపణలు చేయగలమని అంటున్నారు.

  • Loading...

More Telugu News