Andhra Pradesh: మా కష్టమేదో మేము పడుతుంటే తెలంగాణ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది: సీఎం చంద్రబాబు ఫైర్
- టీ-సర్కార్ మా విద్యుత్ బకాయిలు చెల్లించదు
- ఆస్తులు విభజించదు
- ఏపీపై పెత్తనం చేయాలని చూస్తోంది
ఏపీపై తెలంగాణ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందంటూ సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ‘తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన రూ.5 వేల కోట్లకుపైగా విద్యుత్ బకాయిలు చెల్లించదు, ఆస్తులు విభజించదు. పైగా మన కష్టమేదో మనం పడుతుంటే కావాలని కుట్రలు చేస్తోంది. జగన్‌ను అడ్డుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌పై పెత్తనం చేయాలని దిగజారుడు రాజకీయాలు చేస్తోంది’ అని మండిపడ్డారు.
మరో ట్వీట్ లో..ఏపీలో వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు చంద్రబాబు తెలిపారు. ‘వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మంత్రి మండలి సమావేశంలో నిర్ణయించాం. ఇందుకు అవసరమైన నిధులు వెంటనే విడుదల చేస్తున్నాం. ప్రతి జిల్లాలో కార్యాచరణ ప్రణాళికపై జేసీ ప్రత్యేక దృష్టి పెట్టేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన రూ.5 వేల కోట్లకుపైగా విద్యుత్ బకాయిలు చెల్లించదు, ఆస్తులు విభజించదు. పైగా మన కష్టమేదో మనం పడుతుంటే కావాలని కుట్రలు చేస్తోంది. జగన్‌ను అడ్డుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌పై పెత్తనం చేయాలని దిగజారుడు రాజకీయాలు చేస్తోంది.
— N Chandrababu Naidu (@ncbn) March 6, 2019