sensex: వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 194 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 66 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- రెండు శాతం పైగా లాభపడ్డ రిలయన్స్, ఐసీఐసీఐ, బజాజ్ ఫైనాన్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లన్నింటిలో ఈరోజు ర్యాలీ కొనసాగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తో పాటు బ్యాంకింగ్, ఫైనాన్స్ సెక్టార్లు మన మార్కెట్లను ముందుండి నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 194 పాయింట్లు పెరిగి 36,636కు చేరుకుంది. నిఫ్టీ 66 పాయింట్లు లాభపడి 11,053 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (2.60%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.55%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.15%), వేదాంత లిమిటెడ్ (2.00%), హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (1.32%).
టాప్ లూజర్లు:
టాటా మోటార్స్ (-2.81%), యాక్సిస్ బ్యాంక్ (-1.72%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.38%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.24%), హీరో మోటోకార్ప్ (-1.10%).