BJP: 'ఎంజీ రామచంద్రన్ స్టేషన్‌'గా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కు నామకరణం: ప్రధాని మోదీ ప్రకటన

  • తమిళనాడులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మోదీ
  • ఎయిర్‌పోర్టుల్లో తమిళంలో ప్రకటనలు
  • మాజీ ప్రధాని ఇందిరపై తీవ్ర విమర్శలు

తమిళనాడులోని కాంచీపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన నరేంద్రమోదీ అన్నాడీఎంకే సహా మిత్రపక్షాలతో కలిసి నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. చెన్నై రైల్వే స్టేషన్ పేరును మార్చబోతున్నట్టు చెప్పారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ పేరును స్టేషన్‌కు పెట్టాలనుకుంటున్నట్టు తెలిపారు. అలాగే, విమానాశ్రయాల్లో ఇకపై తమిళంలోనూ ప్రకటనలను చేయాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు.

తమకు ఇష్టం లేని ప్రభుత్వాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తుందని ఆరోపించిన మోదీ.. గతంలో ప్రజలు ఎన్నుకున్న ఎంజీఆర్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఏకంగా 50 ప్రభుత్వాలను రద్దు చేయించారన్నారు. ప్రతిపక్ష నేతలందరూ తనను విమర్శించడంలో పోటీ పడుతున్నారన్న మోదీ.. తన కుటుంబంపై చెడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలే తమకు అధిష్ఠానమని, దేశ భద్రత విషయంలో తాము రాజీ పడబోమని ప్రధాని తేల్చి చెప్పారు.  

  • Loading...

More Telugu News