rs: ఇండియాలో తొలిసారిగా... త్వరలోనే రూ. 20 నాణెం విడుదల... ఎలా ఉంటుందంటే..!

  • 12 అంచులు కలిగి ఉన్న నాణెం
  • నాణేనికి రెండు రింగులు
  • విడుదల తేదీని ప్రకటించని కేంద్ర ఆర్థిక శాఖ

త్వరలోనే మరో కొత్త నాణెం రాబోతోంది. రూ. 20 నాణేన్ని విడుదల చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న రూ. 10 నాణెం మాదిరి కాకుండా... రూ. 20 నాణేన్ని సరికొత్తగా తీసుకొస్తున్నారు. ఈ నాణేనికి 12 అంచులు ఉంటాయని ఆర్థిక శాఖ తన నోటిఫికేషన్ లో పేర్కొంది. ఈ నాణేనికి రెండు రింగులు ఉంటాయి. వెలుపలి రింగ్ ను 65 శాతం రాగి, 15 శాతం జింక్, 20 శాతం నికెల్ తో తయారు చేస్తుండగా... లోపలి రింగ్ ను 75 శాతం రాగి, 20 శాతం జింక్, 5 శాతం నికెల్ తో తయారు చేయారు చేస్తున్నారు. నాణేన్ని ఎప్పుడు విడుదల చేస్తున్నారన్న విషయాన్ని మాత్రం ఆర్థిక శాఖ వెల్లడించలేదు.

ఈ నాణెంపై అశోక స్తంభం 'సత్యమేవ జయతే' సూక్తి, భారత్ అన్న హిందీ అక్షరాలు, ఇండియా అన్న ఆంగ్ల అక్షరాలు ఉంటాయి. రూ. 10 నాణేల అంచులపై ఉన్నట్టుగా దీనిపై ఏ విధమైన మార్క్ ఉండవు. దాదాపు పదేళ్ల క్రితం రూ. 10 నాణెం చలామణిలోకి రాగా, ఆపై 14 సార్లు డిజైన్ ను మార్చిన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో ఈ నాణేలు చెల్లవంటూ వదంతులు రాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటిని కొట్టిపారేసింది.

  • Loading...

More Telugu News