India: సీఆర్పీఎఫ్ అమర జవాన్లకు క్రికెటర్ల నివాళి.. ఆర్మీ టోపీలతో మైదానంలోకి భారత ఆటగాళ్లు!
- టోపీలను అందజేసిన ధోని
- నేడు రాంచీలో మూడో వన్డే
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో జైషే ఉగ్రవాది చేసిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుల్వామా ఘటనలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పిస్తూ భారత జట్టు మైదానంలోకి దిగనుంది.
ఈరోజు ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా భారత జట్టు ఆటగాళ్లు ఆర్మీ సిబ్బంది ధరించే టోపీలతో మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ టోపీలను టీమిండియా మాజీ సారథి, లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర సింగ్ ధోని జట్టులోని ఆటగాళ్లకు అందజేశారు. ఈరోజు మూడో వన్డేలో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.