asaduddin owaisi: అయోధ్య మధ్యర్తిత్వ కమిటీలో ఆయన ఎందుకు?: ఒవైసీ అభ్యంతరం

  • అయోధ్య వివాద పరిష్కరానికి మధ్యవర్తిత్వ కమిటీని ప్రకటించిన సుప్రీంకోర్టు
  • శ్రీశ్రీ రవిశంకర్ కమిటీలో ఉండటంపై ఒవైసీ అభ్యంతరం
  • ఆయన స్థానంలో తటస్థ వ్యక్తిని నియమించాలని వ్యాఖ్య

అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదాన్ని పరిష్కరించే క్రమంలో మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు మొగ్గుచూపిన సంగతి తెలిసిందే. ముగ్గురు వ్యక్తులతో కూడిన మధ్యవర్తిత్వ కమిటీని సుప్రీం ప్రకటించింది. ఈ కమిటీలో సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎఫ్ఎం ఇబ్రహీం ఖలీఫుల్లా, ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ అడ్వొకేట్ శ్రీరామ్ పంచు ఉన్నారు. ఈ కమిటీకి ఛైర్ పర్సన్ గా ఖలీఫుల్లా వ్యవహరిస్తారు.

మరోవైపు, వివాదాన్ని పరిష్కరించడానికి మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు మొగ్గు చూపడాన్ని తాము స్వాగతిస్తున్నామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. అయితే, ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ ను కమిటీలోకి తీసుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అయోధ్య విషయంలో ముస్లింలు తమ పట్టును విడువకపోతే.. ఇండియా మరో సిరియాలా మారుతుందని గతంలో ఓ సందర్భంగా రవిశంకర్ అన్నారని... ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో ఒక తటస్థ వ్యక్తిని నియమిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News