sensex: ర్యాలీకి బ్రేక్.. వారాంతాన్ని నష్టాల్లో ముగించిన మార్కెట్లు
- ఉదయం నుంచి ఒడిదుడుకులకు గురైన మార్కెట్లు
- 54 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 4 శాతం వరకు నష్టపోయిన టాటా మోటార్స్
ఈ వారం ఆరంభం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగిన ర్యాలీకి ఈరోజు బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడంతో... ఈ ఉదయం నుంచి మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 54 పాయింట్లు కోల్పోయి 36,671కి పడిపోయిది. నిఫ్టీ 23 పాయింట్లు నష్టపోయి11,035 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (4.28), బజాజ్ ఆటోమొబైల్స్ (1.38), బజాజ్ ఫైనాన్స్ (1.13), సన్ ఫార్మా (0.92), టీసీఎస్ (0.54).
టాప్ లూజర్స్:
టాటా మోటార్స్ (3.99), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.53), టాటా స్టీల్ (2.43), వేదాంత లిమిటెడ్ (2.02), ఇన్ఫోసిస్ (1.48).