Pawan Kalyan: మ్యానిఫెస్టోలో ఉన్న కీలక అంశాలను ముందే బయటపెట్టిన పవన్ కల్యాణ్
- రైతు కుటుంబాలకు రూ.8 వేలు సాయం
- మహిళాదినోత్సవం రోజున ప్రకటన
- ఆడపడుచుల కోసమేనంటూ స్పష్టీకరణ
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మహిళా దినోత్సవం నాడు కీలక ప్రకటన చేశారు. జనసేన మ్యానిఫెస్టోలోని కొన్ని కీలక అంశాలను ముందే వెల్లడించారు. వాస్తవానికి ఆయన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా వెల్లడించాలని భావించిన అంశాలను మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందే ప్రకటించారు.
ప్రతి రైతు కుటుంబానికి రూ.8 వేలు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్టు తెలిపారు. రైతు కుటుంబాల్లోని ఆడపడుచుల కోసమే ఈ సాయం అంటూ స్పష్టం చేశారు. మహిళల అభ్యున్నతికి జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పిన ఆయన మహిళలకు తమ పార్టీలో 33 శాతం మేర పదవులు కేటాయించామని తెలిపారు. చట్టసభల్లో కూడా 33 శాతం మహిళలకే అమలు చేయాలని ఉందని, అయితే ప్రత్యర్థుల వ్యూహాలను బట్టి తన నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. ఉపాధి హామీలో అన్నీ అవకతవకలేనని ఆరోపించారు పవన్ కల్యాణ్. ఉపాధి హామీ పథకంతో వ్యవసాయరంగాన్ని అనుసంధానం చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు.