hy: భారత్ ని మోదీ రెండు ముక్కలు చేయాలని చూస్తున్నారు: రాహుల్ గాంధీ
- ఒక భాగాన్ని ధనికులకు మోదీ కేటాయించారు
- పెట్టుబడిదారులకు లాభం చేకూర్చాలని చూస్తున్నారు
- అనిల్ అంబానీకి రూ. వేల కోట్లు లబ్ధి చేకూర్చారు
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. శంషాబాద్ లో ఈరోజు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, భారత్ ని రెండు ముక్కలు చేయాలని ప్రధాని మోదీ చూస్తున్నారని ఆరోపించారు. భారత్ లో ఒక భాగాన్ని ధనికుల కోసం మోదీ కేటాయించారని, పెట్టుబడిదారులకు లాభం చేకూర్చేలా ఆయన వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి పారిపోయిన వారి గురించి మోదీ పట్టించుకోరని, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వాళ్లపై చర్యలు ఉండవని విమర్శించారు. రాఫెల్ ఒప్పందంలో అనిల్ అంబానీకి రూ. వేల కోట్లు లబ్ధి చేకూర్చారని, రూ.526 కోట్లతో తయారు కావాల్సిన రాఫెల్ యుద్ధవిమాన వ్యయాన్ని, రూ.1600 కోట్లకు ప్రధాని మోదీ పెంచారని ఆరోపించారు.