Andhra Pradesh: ముళ్ల పొదల్లో సజీవంగా చిన్నారి.. కాపాడి ఆసుపత్రికి తీసుకెళ్లిన స్థానికులు!
- ఏపీలోని కర్నూలు జిల్లాలో ఘటన
- ముళ్ల పొదల్లో చిన్నారి ఏడుపు
- పాప ఆరోగ్యం స్థిరంగా ఉందన్న వైద్యులు
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హోళిగుంద మండలం మెర్మికి గ్రామ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును ముళ్ల పొదల్లో పడేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా చిన్నారి ఏడుపు విన్న స్థానికులు పాపను రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయమై వైద్యులు స్పందిస్తూ.. చిన్నారికి స్వల్ప గాయాలు అయ్యాయని తెలిపారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం స్థిరంగా ఉందని పేర్కొన్నారు. త్వరలోనే పోలీస్ అధికారుల సాయంతో చిన్నారిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని చెప్పారు.