Congress: మెరుపు దాడులపై కాంగ్రెస్ సందేహాలు.. పార్టీకి షాకిచ్చిన బీహార్ సీనియర్ నేత!

  • వైమానిక దాడిపై కాంగ్రెస్ సందేహాలు
  • సాక్ష్యాలు చూపించాలని డిమాండ్
  • మనస్తాపంతో రాజీనామా చేసిన వినోద్ శర్మ

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ భూభాగంలోని ఉగ్రస్థావరాలపై భారత్ వైమానిక దాడి జరిపి స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ దాడిలో 300 మందికిపైగా ఉగ్రవాదులు హతమైనట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఈ దాడులపై తొలి నుంచీ సందేహాలు వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్.. అందుకు సంబంధించిన సాక్ష్యాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తోంది. భారత వైమానిక దాడులపై ఆధారాలు చూపించాలన్న కాంగ్రెస్ అధిష్ఠానం తీరును తప్పుబడుతూ బీహార్‌కు చెందిన ఆ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి వినోద్ శర్మ పార్టీకి రాజీనామా చేశారు.

వైమానిక దాడులను ప్రశ్నించడం వల్ల క్షేత్రస్థాయిలో ఎంతోమంది కాంగ్రెస్ కార్యకర్తలు నిరాశకు గురయ్యారని ఈ సందర్భంగా వినోద్ శర్మ పేర్కొన్నారు. ఈ విషయమైన పార్టీ చీఫ్ రాహుల్‌కు లేఖ రాసినప్పటికీ పట్టించుకోలేదన్నారు. పార్టీ తీరుకు నిరసనగా కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వంతోపాటు అన్ని పదవులకు రాజీనామా చేసినట్టు చెప్పారు. వైమానిక దాడులకు ఆధారాలు అడగడంపై తాను తీవ్ర మనస్తాపానికి గురైనట్టు పేర్కొన్నారు. భద్రతా దళాలు చేపట్టే ప్రతి పనినీ సమర్థించాల్సింది పోయి ఇలా రాజకీయం చేయడం తగదని ఆయన హితవు పలికారు.  

  • Loading...

More Telugu News