Social Media: సరిగ్గా పుట్టినరోజుకు ముందే గుండెపోటుతో మరణించిన మోడల్
- విహార యాత్రలో గుండెపోటు
- కోమాలోనే తుదిశ్వాస
- 20 ఏళ్లకే నిండు నూరేళ్లు
మాజీ మిస్ టీన్ యూనివర్స్ లోట్టే వాన్ డెర్జీ తీవ్ర గుండెపోటుతో మరణించింది. పుట్టినరోజుకు ముందు ఆస్ట్రియాలోని వెస్టెండార్ఫ్ విహారయాత్రలో అనుకోని రీతిలో ప్రాణాలు విడిచింది. డెర్జీ వయసు 20 సంవత్సరాలు. వెస్టెండార్ఫ్ మంచు పర్వతాల్లో కుటుంబ సభ్యులతో ఆస్వాదించడానికి వెళ్లిన ఈ డచ్ మోడల్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు తమ కుమార్తె ఇంకా రాకపోవడంతో తల్లిదండ్రులు వెళ్లిచూడగా తన గదిలో బెడ్ పై అపస్మారక స్థితిలో పడివుంది డెర్జీ. ఆ తర్వాత కొద్దిసేపటికే గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. కోమాలోకి వెళ్లిన డెర్జీ మృత్యువుతో పోరాటంలో ఓడిపోయింది. 2017లో డెర్జీ మిస్ టీన్ యూనివర్స్ కిరీటం గెలుచుకుంది. అప్పటి నుంచి మోడలింగ్ ప్రపంచంలో కొనసాగుతోంది. సోషల్ మీడియాలో ఆమెకు ఎంతోమంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె మృతిపై తల్లిదండ్రులు స్పందిస్తూ, తమ కుమార్తెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తెలిపారు.