Vote: మీ ఓటు ఉందో, లేదో చెక్ చేసుకోండిలా!
- కాక రేపుతున్న ఓట్ల గల్లంతు వ్యవహారం
- హెల్ప్ లైన్ నంబర్ 1950
- కాల్ చేసి ఓటును పరిశీలించుకోవాలన్న అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల గల్లంతు వ్యవహారం రాజకీయ పార్టీల మధ్య కాకరేపుతున్న వేళ, అటు సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీకి అసెంబ్లీ ఎన్నికలు వచ్చేశాయి. ఈ నేపథ్యంలో ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవాలని, ఒకవేళ లేకుంటే 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఓటర్ హెల్ప్ లైన్ గా 1950 నంబర్ ను ఏర్పాటు చేశామని, దీనికి కాల్ చేసి మీ వివరాలు చెప్పి ఓటు హక్కు ఉందో? లేదో? తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ఓటర్ హెల్ప్ లైన్, నా ఓట్, వాదా యాప్ ల నుంచి కూడా జాబితాలో పేరును చూసుకోవచ్చని, 'http://ceotelangana.nic.in', 'http://ceoandhrapradesh.nic.in' వెబ్ సైట్ లోనూ, ఆప్షన్ ను ఎంచుకుని ఓటును చెక్ చేసుకోవచ్చని తెలిపారు. దీంతో పాటు ఓటర్ల జాబితాలను బూత్ లెవల్ ఏజంట్ వద్ద అందుబాటులో ఉంచామని అధికారులు వెల్లడించారు.