Vijayasaireddy: చిట్టి నాయుడి 'చిప్' పనిచేయడం లేదు... బంకర్ లో దాగిన పప్పు నాయుడు: విజయసాయిరెడ్డి సెటైర్లు
- చిట్టి నాయుడి మెదడులో చిప్
- దానికి సిగ్నల్స్ అందడం లేదు
- అందుకే పెద్దనాయుడు రంగంలోకి
- ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి
తెలుగు రాష్ట్రాల మధ్య దుమారం రేపుతున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ, డేటా చోరీ వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ నేతలను టార్గెట్ చేసుకుని తన ట్విట్టర్ ఖాతాలో సెటైర్లు వేశారు. "ఐటీ గ్రిడ్ క్లోజయినప్పటి నుంచి చిట్టి నాయుడు మెదడులో అమర్చిన 'చిప్' సిగ్నల్స్ తీసుకోవడం లేదట. ‘ERROR’ చూపిస్తోంది. అందుకే వారం రోజులుగా అజ్ఞాతంలోకి పంపించాడు పెద్ద నాయుడు. డేటా దొంగ అశోక్ ప్రస్తుతం చిప్ ను యాక్టివేట్ చేసేందుకు విఫలయత్నం చేస్తున్నాడు" అని వ్యాఖ్యానించారు.
ఆపై "అధికారులు ఇక నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఎలక్షన్ కోడ్ అమలు లోకి వచ్చింది. చంద్రబాబు, ఆయన తొత్తులకు భయపడాల్సిన అవసరం లేదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ముక్త కంఠంతో మార్పుకోరుకుంటున్నారు. ఈ చారిత్రక ధర్మపోరాటంలో పోలీసు, సివిల్ అధికారులంతా న్యాయం వైపు నిలవాలి" అని, "డేటా చోరీ కేసులో అడ్డంగా దొరికిన తర్వాత పప్పు నాయుడు బంకర్ లో దాక్కున్నాడా? ఎవరికీ కనిపించకుండా ఎటు వెళ్లాడు? అజ్ఞాతంలో లేకపోతే మీడియా ముందు మాట్లాడాలి. మంత్రిగా జీతభత్యాలు తీసుకుంటూ ప్రజలకు అందుబాటులో లేకుండా ట్విట్టర్ మ్యాన్ అయిపోతే ఎలా?" అని ట్వీట్లు పెట్టారు.
డేటా చోరీ కేసులో అడ్డంగా దొరికిన తర్వాత పప్పు నాయుడు బంకర్ లో దాక్కున్నాడా? ఎవరికీ కనిపించకుండా ఎటు వెళ్లాడు? అజ్ణాతంలో లేక పోతే మీడియా ముందు మాట్లాడాలి. మంత్రిగా జీతభత్యాలు తీసుకుంటూ ప్రజలకు అందుబాటులో లేకుండా ట్విట్టర్ మ్యాన్ అయిపోతే ఎలా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 12, 2019
అధికారులు ఇక నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఎలక్షన్ కోడ్ అమలు లోకి వచ్చింది. చంద్రబాబు, ఆయన తొత్తులకు భయపడాల్సిన అవసరం లేదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ముక్త కంఠంతో మార్పుకోరుకుంటున్నారు. ఈ చారిత్రక ధర్మపోరాటంలో పోలీసు, సివిల్ అధికారులంతా న్యాయం వైపు నిలవాలి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 12, 2019
ఐటీ గ్రిడ్ క్లోజయినప్పటి నుంచి చిట్టి నాయుడు మెదడులో అమర్చిన ‘చిప్’ సిగ్నల్స్ తీసుకోవడం లేదట. ‘ERROR’ చూపిస్తోంది. అందుకే వారం రోజులుగా అజ్ణాతంలోకి పంపించాడు పెద్ద నాయుడు. డేటా దొంగ అశోక్ ప్రస్తుతం చిప్ ను యాక్లివేట్ చేసేందుకు విఫలయత్నం చేస్తున్నాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 12, 2019