Special Trains: వేసవి రద్దీ దృష్ట్యా 94 ప్రత్యేక రైళ్లు!
- విశాఖ - సికింద్రాబాద్ మధ్య 26 రైళ్లు
- విశాఖ నుంచి తిరుపతికి కూడా
- జూన్ 29 వరకూ ప్రత్యేక రైళ్లు
ఈ వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని, తెలుగు రాష్ట్రాల నుంచి 94 వీక్లీ ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఏప్రిల్ 1నుంచి జూన్ 29 వరకు వీటి రాకపోకలు సాగుతాయని పేర్కొంది. విశాఖపట్నం - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - విశాఖపట్నం నగరాల మధ్య 26 రైళ్లు నడిపిస్తామని, ఇవి విజయవాడకు వెళ్లకుండా రాయనపాడు మీదుగా రాకపోకలు సాగిస్తాయని పేర్కొంది.
ఇదే సమయంలో విశాఖపట్నం - తిరుపతి, తిరుపతి - విశాఖపట్నం మధ్య 26, జబల్ పూర్ - తిరునల్వేలి, తిరునల్వేలి - జబల్ పూర్‌ల మధ్య 26 ప్రత్యేక రైళ్లు ఉంటాయని వెల్లడించింది. మచిలీపట్నం - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - మచిలీపట్నం మధ్య 8, నర్సాపూర్ - హైదరాబాద్, హైదరాబాద్ - నర్సాపూర్ మధ్య 4, హైదరాబాద్ - విజయవాడ, విజయవాడ - హైదరాబాద్ మధ్య 4 స్పెషల్ రైళ్లు ఉంటాయని పేర్కొంది.