JDS: కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్‌ల మధ్య కొలిక్కి వచ్చిన సీట్ల పంపిణీ వ్యవహారం

  • గతంలోనూ అధికారాన్ని చేజిక్కించుకున్న కూటమి
  • లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధం
  • జేడీఎస్‌కు 8, కాంగ్రెస్ కు 20 స్థానాలు

కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్‌ల సీట్ల పంపిణీ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. నేడు భేటీ అయిన ఇరు పార్టీలు సీట్ల పంపకంపై ఒక అవగాహనకు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, జేడీఎస్ పొత్తుతో అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. అదే తరహాలో లోక్‌సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటేందుకు రెండు పార్టీలు ఏకాభిప్రాయంతో ఒక తాటిపైకి వచ్చాయి.

మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు గాను.. జేడీఎస్‌కు 8 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకారం తెలిపింది. మిగిలిన 20 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ బరిలోకి దిగనుంది. జేడీఎస్‌కు కేటాయించిన స్థానాలు.. చిక్ మగుళూరు, బెంగుళూరు నార్త్, హసన్, విజయపుర, మాండ్య, షిమోగా, ఉత్తర కన్నడ, తుంకూరు. ఇవి మినహా మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది.

  • Loading...

More Telugu News